పాత తరం హీరోయిన్లలో అద్భుత నటి అరుణ.తన అందంతో పాటు అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ నటీమణి.
చాలా సంవత్సరాల తర్వాత తన సినిమా కెరీర్ తో పాటు నిజ జీవితం గురించి పలు విషయాలు వెల్లడించింది.అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొని పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.
ఇంతకీ అలనాటి అందాల తార ముచ్చర్ల అరుణ చెప్పిన ముచ్చట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అరుణ.1963, సెప్టెంబర్ 13న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జన్మించింది.తన చదువు అంతా హైదరాబాద్ లోనే కొనసాగింది.
తనకు ఓ సోదరి, ఓ సోదరుడు ఉన్నాడు.చదువుకుంటున్న సమయంలోనే డ్యాన్స్ తో పాటు సంగీతం నేర్చుకుంది.
ఆ సమయంలోనే తమిళ దర్శకుడు భారతీరాజ తనను చూశాడు.తన సినిమాలో అవకాశం కల్పించాడు.1980లో ఒక తమిళ సినిమా చేసి వెండి తెరకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత తెలుగులో సీతాకోక చిలుక అనే సినిమా చేసింది.
ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది.ఈ సినిమాతో సీతాకోక చిలుక అరుణగా మారిపోయింది.
అనంతరం పలు హిట్ సినిమాల్లో నటించింది.దాదాపు 36 తెలుగు సినిమాలు చేసింది.
తమిళంలో 24 సినిమాలు చేసింది.మలయాళంలో 14, కన్నడలో 3 సినిమాల్లో యాక్ట్ చేసింది.

1990 వరకు ఆమె వరుసగా సినిమాలు చేసింది.అదే సమయంలో మోహన్ తో ఆమె వివాహం జరిగింది.పెళ్లి తర్వాత నటనా జీవితానికి పూర్తిగా గుడ్ బై చెప్పింది.అరుణ-మోహన్ దంపతులకు నలుగురు ఆడపిల్లలు.ఇద్దరికి వివాహాలు అయ్యాయి.మరో ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో చదువుకుంటున్నారు.
ప్రస్తుతం తను హ్యాపీగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అరుణ.
తన రోజు వారీ పనులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అప్ లోడ్ చేస్తూ.తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.