ప్రముఖ బుల్లితెర యాంకర్లలో ఒకరైన వర్షకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.సీరియల్స్ నుంచి జబర్దస్త్ షోకు వచ్చిన వర్ష ఇతర ఛానెల్స్ షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
అయితే ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వర్ష తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నారు.రోజా జబర్దస్త్ షోను వదిలేస్తున్నావట కద ? అని అడగగా వర్ష ఎమోషనల్ అవుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.
మన వరకు ఏవైనా కామెంట్లు చేసుకుంటే అవి చాలా ఈజీగా తీసుకుంటామని వర్ష చెప్పుకొచ్చారు.మనం ఇక్కడ వేరుగా ఉంటామని బయట వేరుగా ఉంటామని వర్ష తెలిపారు.
కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతూ తన తమ్ముడు ముఖంపై ఫోన్ పెట్టి ఏంటక్కా అని అడిగితే సమాధానం చెప్పలేకపోయానని వర్ష కామెంట్లు చేశారు.తన తమ్ముడు అలా చెబితే అతనిని తాను ఫేస్ చేయలేకపోయానని వర్ష వెల్లడించారు.
తాను అందరినీ ఒకటే అడుగుతున్నానని మీ ఇంట్లో మీ సిస్టర్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట అంటే మా సిస్టర్ ను ఎందుకు అన్నారని మీకు కోపం వస్తుంది కదా అని వర్ష ప్రశ్నించారు.మీరు ఏదైనా కామెంట్లు చేసే సమయంలో తాను ఆడపిల్లను కదా మీకు ఇంత కూడా జాలి అనిపించలేదా ? అని వర్ష కామెంట్లు చేశారు.వర్ష ఏడుస్తూ అలా కామెంట్లు చేయడంతో ఆమె నిజంగా జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్నారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టీవీ ఆర్టిస్ట్ లు సరదాగా చేసే స్కిట్లు, ఈవెంట్ల విషయంలో కొంతమంది తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో వర్ష ఆ నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.వర్ష కామెంట్ల తరువాతైనా ఆమెపై నెగిటివ్ కామెంట్లు తగ్గుతాయేమో చూడాల్సి ఉంది.