టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న అతి తక్కువమంది డైరక్టర్స్ లో మారుతి ఒకరు.తను చేస్తున్న సినిమాలన్ని మినిమం గ్యారెంటీ హిట్ సాధిస్తాయి.
మొదట్లో కొద్దిగా అడల్ట్ డోస్ ఎక్కువగా ఉన్న సినిమాలు చేసినా ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల మీద దృష్టి పెట్టాడు మారుతి.ప్రతిరోజూ పండుగే సినిమా హిట్ తర్వాత మారుతి గోపీచంద్ తో పక్కా కమర్షియల్, సంతోష్ శోభన్ తో మంచి రోజులు వచ్చాయి సినిమాలు చేస్తున్నాడు.
మంచి రోజులు వచ్చాయి షూటింగ్ పూర్తి కాగా పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత మారుతి ఓ మెగా మూవీ చేస్తాడని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవితో మారుతి సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్.చిరు కోసం మారుతి ఓ కథ సిద్ధం చేసుకున్నాడట.మెగాస్టార్ ని కలిసి లైన్ కూడా వినిపించాడట.ఫుల్ స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేస్తానని అన్నారట.అల్లు ఫ్యామిలీకి బాగా క్లోజ్ గా ఉండే మారుతి మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.చిరుకి ఫైనల్ స్క్రిప్ట్ కూడా నచ్చితే మారుతి డైరక్షన్ సినిమా ఫిక్స్ అయినట్టే అంటున్నారు.
ఈ సినిమాను కూడా గీతా ఆర్ట్స్ నిర్మించే ఛాన్స్ ఉందని టాక్.మొత్తానికి మారుతి డైరక్షన్ లో మెగాస్టార్ మెగా మూవీ ఉండబోతుందని లేటెస్ట్ టాక్.