సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతుండటం కామన్.మనం ఈ రోజు చూసిన వీడియో రేపు కనిపించదు.
యూనిక్ ప్లస్ డిఫరెంట్ కంటెంట్ అయితే చాలు ఆటోమేటిక్‌గా నెట్టింట హల్‌చల్ అవుతుంది.ఈ క్రమంలోనే ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
రెండు దేశాలకు సంబంధించిన అంశాలను ఈ వీడియోలో పోల్చి చూస్తున్నారు.ఇంతకీ సదరు వీడియో ఏముందంటే.
మాతృత్వం మహిళకు దేవుడు ఇచ్చిన అరుదైన వరం అని పెద్దలు చెప్తుంటారు.ప్రతీ ఒక్కరు అమ్మ నుంచే వస్తుంటారు.
ఈ సందర్భంలో అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం.అమ్మ లాలన, జోలిపాట వినగానే నోస్టాల్జియాలోకి వెళ్లిపోతాం.
మనం ఎంతపెద్ద వాళ్లమైనా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాం.అమ్మ కాళ్లమీద మనకు సోయిలేని చిన్నతనంలో స్నానం చేయించడం గురించి తెలుసుకుంటే ఆనందమేస్తుంది.
ఇలా అమ్మ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.ఈ క్రమంలో చిన్నారి ఏడవకుండా ఉండేందుకు గాను ఏవేవో ముచ్చట్లు చెప్తూ స్నానం చేపిస్తుంటారు తల్లులు.
ఇది భారతదేశం సంగతి మాత్రమే.వేరే దేశాల్లో ఇలా ఉండదు.
విదేశాల్లో సెపరేట్ బాత్ టబ్స్ వేసి అందులో సోప్స్ ఉంచి స్నానం చేయిస్తుంటారు.
కొందరైతే స్విమ్మింగ్ పూల్‌లోనే చిన్నారులకు సైతం స్నానం చేయిస్తుంటారు.ఈ నేపథ్యంలో ఇండియా వర్సెస్ అమెరికా అంటూ ఆ దేశ, మన దేశ స్నాన పద్ధతిపై ఫన్నీ వీడియో చేశారు.ఆ వీడియో చూసి నెటిజన్లు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో సదరు వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.విపరీతమైన నవ్వులు పూయించడంతో పాటు ఆనందాన్ని పంచుతోంది.
ప్రతీ ఒక్కరు ఈ వీడియో చూసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.తల్లి చేతితో తినే గోరుముద్దలు, స్నానం చేయించడం గురించి చర్చించుకుంటున్నారు.