చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ కు ఫిదా అవుతారనే సంగతి తెలిసిందే.హిట్ ఫ్లాప్ రిజల్ట్ తో సంబంధం లేకుండా రజనీకాంత్ క్రేజ్ సినిమాసినిమాకు పెరుగుతోంది.
అతి సామాన్య కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన రజినీకాంత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు.అయితే ఈ హీరో ఒక సీన్ సరిగ్గా చేయలేదని స్టార్ డైరెక్టర్ బాలచందర్ కొట్టారని సమాచారం.
రజినీకాంత్ కు నటుడిగా ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి దర్శకుడు బాలచందర్ కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే.ఎవరైనా బాగా నటిస్తే మెచ్చుకునే బాలచందర్ సరిగ్గా నటించకపోతే మాత్రం ఆయా నటులపై తన కోపాన్ని ప్రదర్శిస్తారు.
మూండ్రు మూడిచ్చు అనే సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించగా శ్రీదేవి హీరోయిన్ గా నటించారు.ఆ సినిమా షూటింగ్ లో ఒక సీన్ లో రజినీకాంత్ బాగా నటించలేదు.
రజినీకాంత్ సీన్ కు తగిన న్యాయం చేయలేదని బాలచందర్ రజినీకాంత్ పై చేయి కూడా చేసుకున్నారు.ఆ సినిమాలో ఒక సన్నివేశాన్ని పూర్తి చేయడం కోసం నటి శ్రీదేవి ఏకంగా 14 టేకులు తీసుకోగా 14వ టేకుకు ఆ సీన్ ఓకే కావడం గమనార్హం.
అయితే ఆ సినిమాలో ఒక సీన్ కోసం 14 టేకులు తీసుకున్న శ్రీదేవి ఆ తర్వాత తన సినీ కెరీర్ లో అన్ని టేకులు ఎప్పుడూ తీసుకోలేదని సమాచారం.ఈ సినిమా కొరకు రజినీకాంత్ కంటే శ్రీదేవి ఎక్కువమొత్తం పారితోషికం తీసుకున్నారు.
కెరీర్ తొలినాళ్లలో ఇలా కష్టాలు పడిన రజినీకాంత్ తన నటనతో విజయాలను అందుకుని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.రజినీకాంత్ అన్నాత్తే అనే సినిమాలో నటిస్తుండగా తెలుగులో అన్నయ్య లేదా మరో టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.