తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.ఇప్పటికే కొత్త అధ్యక్షులుగా బండి సంజయ్ బీజేపీని పరుగులు పెట్టిస్తుంటే.
ఇక తమకు కూడా అలాంటి ఫైర్ బ్రాండ్ కావాలంటూ కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ఏరికోరి మరీ రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది.దీంతో ఇప్పుడు ఆయన కూడా పార్టీలో జోష్ నింపడం గమనార్హం.
ఇక దొరికిందే అవకాశం అన్నట్టు వై.ఎస్.
షర్మిల కూడా ఓ పార్టీ పెట్టేసి ఎంచక్కా రాజకీయాలు చేసేస్తోంది.ఇదిలా ఉండగా.
ఇప్పుడు మరో కొత్త రాజకీయ శక్తి రాబోతోంది.గురుకులాల కార్యదర్శిగా ఎంతోమందికి దగ్గరయ్యారు ఆర్.
ప్రవీణ్‌కుమార్.
ఇక తాను కూడా తన ఐపీఎస్ పదవికి వీఆర్ ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు.
అయితే ఈయనపై మొదటి నుంచి టీఆర్ ఎస్‌లోకి వస్తారనే ప్రచారం బాగానే ఉంది.కానీ అనూహ్యంగా ఆయన ఇప్పుడు వరుసగా టీఆర్ ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
కేసీఆర్‌పై బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు.దీంతో ఆయన ఇప్పుడు టీఆర్ ఎస్‌లోకి వెళ్లే అవకాశం లేదని తెలిసిపోతోంది.
అయితే ఆయన మొదటి నుంచి బహుజన నినాదం ఎత్తుకోవడంతో ఆయన కొత్త పార్టీ పెడతారా లేక ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
కాగా ఇప్పుడు ఆయన అనూహ్యంగా బీఎస్పీలోకి వెల్లేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.ఎందుకంటే రీసెంట్‌గానే ఆయన మాయావతిని వెళ్లి కలిసి వచ్చినట్టు తెలుస్తోంది.ఇక మాయావతి కూడా తాజాగా తెలంగాణలో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తమ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఈ విషయాన్ని జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రచారుం చేస్తోంది.ఇక ప్రవీణ్ కుమార్ కూడా బహుజన నినాదంతో త్వరలోనే బీఎస్పీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఆయన కూడా నల్గొండలోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారని సమాచారం.