బాలనటుడిగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన తేజ సజ్జా జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా కూడా సక్సెస్ సాధించారు.ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో వచ్చాయి.
ఆ సినిమా సక్సెస్ వల్ల తేజ సజ్జా రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం తేజ సజ్జా ఒక్కో సినిమాకు ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తేజ సజ్జా తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయింది.తేజ సజ్జా తొలి సినిమానే డిఫరెంట్ జానర్ లో తెరకెక్కగా ప్రస్తుతం ఈ హీరో హను మాన్ సినిమాలో నటిస్తున్నారు.
తొలి సినిమా సక్సెస్ సాధించినప్పటికీ తేజ సజ్జా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఫిక్షనల్ కథగా ఈ మూవీ తెరకెక్కనుందని సూపర్ హీరో సిరీస్ లో ఈ మూవీని తీస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా కొరకే తేజ సజ్జా కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుండగా కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో తేజ సజ్జా చేరారు.

ప్రతిభ పుష్కలంగా ఉండటం వల్లే తేజ సజ్జాకు ఈ స్థాయిలో పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది.మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తేజ సజ్జా ఈ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని భోగట్టా.తేజ సజ్జా భవిష్యత్తు సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే అతని పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది.