ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ ఏనాడు కూడా దళితుల గురించి పట్టించుకోలేదని ఇప్పుడు సడెన్ గా దళిత రాగం ఎందుకు ఎత్తుకున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు.సీఎం అకస్మాత్తుగా దళితుల మీద ఇంత ప్రేమ కురిపించడానికి కారణంహుజురాబాద్ ఉప ఎన్నికనా.
లేక కొత్తగా ప్రకటించిన టీపీసీసీ ఛీఫ్ పేరా అని ఆలోచనలో పడ్డారట.హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ నుంచి బయటకు వెళ్లి కాషాయ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అధికార టీఆర్ఎస్ ఢీ కొంటుంది.
దీంతో అక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది.
కాగా ఇన్నాళ్లు ఆటలో అరటి పండులా ఉన్న కాంగ్రెస్ కూడా తమ జట్టుకు కొత్త కెప్టెన్ ను నియమించింది.
ఏ పదవి లేనపుడే కేసీఆర్ ను, టీఆర్ఎస్ నాయకులను కడిగి పారేసిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు అధ్యక్ష పదవి రావడంతో ఆయన ప్రవాహాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదనే విషయాన్ని గ్రహించిన సీఎం ముందుగానే దళితులకు వరాలు ప్రకటించాడని ఇదంతా రాజకీయ ఎత్తుడడలో భాగమనేనని పలువురు చర్చించుకుంటున్నారు.లేకపోతే ఇన్నాళ్లు పట్టించుకోని దళితుల సంక్షేమం కోసం అంతలా సీఎం ఆరాటపడటం నమ్మ శక్యంగా లేదని అంటున్నారు.

అధికార టీఆర్ఎస్ ముందు ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉంది. గులాబీ లీడర్లు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి.ఈటల రాజేందర్, బీజేపీ స్పీడ్ కు కళ్లెం వేయాలని యోచిస్తోంది.కాని అక్కడ అన్ని సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేను ఢీ కొనడం అంటే కాస్త శ్రమించాలని అంటున్నారు.దీని కోసం గులాబీ నాయకులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
కేసీఆర్ నాయకత్వం పై ప్రజల్లో ఆదరణ ఉందని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.