ఎన్నో ఆశలు ఆశలు అంచనాలతో తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు.జూలై ఎనిమిదో తేదీన ఆమె పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్లు అనేక సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చారు.
పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.మధ్య మధ్యలో బిజెపిి పై విమర్శలు చేస్తున్నా, కాంగ్రెస్ ను అసలు ఏమాత్రం పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపించ లేదు అన్నట్లుగానే షర్మిల అభిప్రాయపడుతున్నారు.
అయితేే అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో షర్మిల రాజకీయం పై అనుమానాలు మొదలయ్యాయి.రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందే యాక్టివ్ గా అనేక రాజకీయాలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా పిసిసి అధ్యక్ష పదవి సంపాదించడంంత మరింత దూకుడుగా ఆయన వ్యవహరించే విధంగ కనిపిస్తున్నారు.
అయితే ఇవన్నీ షర్మిలకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తున్నాయి.తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు, ఎస్సీ ఎస్టీ, మైనారిటీలను తమ పార్టీవైపు తీసుకువచ్చేలా వారి మద్దతు తమకు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
వీటితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటును కూడా జనాల్లో కలిగించి లబ్ధి పొందాలని చూస్తున్నారు.అయితే రేవంత్ రెడ్డి పొలిటికల్ గా మరింత యాక్టివ్ కాబోతున్న తరుణంలో రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడదు.

దీంతో పాటు కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడే అవకాశం కనిపిస్తోంది.బిజెపి టిఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నవారు ఇప్పుడు రేవంత్ నాయకత్వం కి మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తుండడంతో, తమ పార్టీలో చేరే వారి సంఖ్య కానీ , మద్దతు ఇచ్చే వారి సంఖ్య గాని బాగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
అలాగే యూత్ లోనూ రేవంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండడం , వాక్ చాతుర్యం ఇవన్నీ షర్మిలకు ఇబ్బంది కలిగించే అంశాలే.ముందు ముందు రేవంత్ పాదయాత్ర ద్వారా తన క్రేజ్ మరింతగా పెంచుకుంటే షర్మిల పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా తయారయ్యే అవకాశం లేక పోలేదు.