సౌత్ లో సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమె ఒక సినిమాలో నటిస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఆ మూవీకి హైప్ వచ్చేస్తుంది.
అలాగే ఆ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అవుతాయనే నమ్మకం ఆడియన్స్ లో బలంగా ఉంటుంది.దీనికి కారణం సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, ఆమెలో ఉన్న డాన్స్ టాలెంట్.
ప్రేమమ్ సినిమా తో నటిగా తెరంగేట్రం చేసి మల్లు ఆడియన్స్ దృష్టిని తన వైపుకి తిప్పుకున్న సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంది.స్టార్ సెలబ్రిటీలు కూడా సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, డాన్స్ కి ఫ్యాన్స్ గా మారిపోయారంటేనే ఆమె ఒక్క సినిమాతో ఎంత మాయ చేసిందో చెప్పొచ్చు.
ఇక ఫిదా సినిమాలో వచ్చిండే సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఆ తరువాత తమిళ్ లో మారి 2లో రౌడీబేబీ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది.
ఆ సాంగ్ ని ఏకంగా వంద కోట్ల మందికి పైగా వీక్షించారంటే దానికి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి లవ్ స్టొరీ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.ఇందులో సారంగాదరియా అనే ఫోక్ సాంగ్ ఒకటి శేఖర్ కమ్ముల పెట్టారు.
తెలంగాణలో మరుగున పడిపోయిన సారంగాదరియా అనే సాంగ్ ని తీసుకొని సినిమాటిక్ స్టైల్ లో ప్రెజెంట్ చేశారు.ఇక ఈ సాంగ్ లో సాయి పల్లవి తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది.
ఇక పూర్తి స్థాయి వీడియో సాంగ్ కూడా రిలీజ్ కాకుండానే లెరికల్ డాన్స్ సాంగ్ వీడియో యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఏకంగా నాలుగు నెలల్లోనే 25 కోట్ల మంది ఈ సాంగ్ ని వీక్షించారంటే ఈ స్థాయిలో సాయి పల్లవికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.