సమంతా, శర్వానంద్, లీడ్ రోల్ లో వచ్చిన సినిమా జాను. ఈ మూవీ తమిళంలో 96 టైటిల్ తో విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది.
దీంతో దిల్ రాజు అదే దర్శకుడిని తీసుకొచ్చి తెలుగులో జాను టైటిల్ తో రీమేక్ చేయించారు.అయితే తెలుగులో మాత్రం ఫలితం నిరాశాజనంగా వచ్చింది.
ఫీల్ గుడ్ మూవీగా అనిపించినా ఎందుకనో ఆడియన్స్ కథకి సింక్ కాలేకపోయారు.దీంతో మూవీ డిజాస్టర్ అయ్యింది.
ఇదిలా ఉంటే తమిళ్, తమిళ్ బాషలలో జూనియర్ త్రిష, సమంత పాత్రలలో గౌరీ కిషన్ అనే బ్యూటీ నటించింది.టీనేజ్ గర్ల్ గా ఈ అమ్మడు సినిమాలో ఎక్కువ సమయం కనిపించి తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులోకి హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది.సంతోష్ శివన్ కి జోడీగా గౌరీ కిషన్ నటించబోతుంది.
ఇప్పటికే తమిళ్ లో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు తెలుగులో తెరంగేట్రం చేయబోతుంది.
మెగాస్టార్ కూతురు సుస్మిత నిర్మాణంలో తమిళ్ హిట్ మూవీ 8 తొట్టకల్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తుంది.ఒరిజినల్ తెరకెక్కించిన దర్శకుడు శ్రీ గణేష్ తెలుగు వెర్షన్ కి కూడా పని చేస్తున్నాడు.
ఇక ఈ మూవీలో సంతోష్ శోభన్ కి జోడీగా గౌరీ కిషన్ నటించబోతుంది.త్వరలో ఈ మూవీ పట్టాలు ఎక్కుతుంది.
మొత్తానికి ఏక్ మినీ కథ సూపర్ హిట్ తో కుర్ర హీరో సంతోష్ ఏకంగా మెగా కాంపౌండ్ లోకి వచ్చి పడటం నిజంగా విశేషం అని చెప్పాలి.