పెళ్లి అనగానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో తెలియని ఆనందం, బంధు మిత్రుల హడావిడితో చాలా కోలాహలంగా ఉంటుంది.ఒక్క మాటలో చెప్పాలంటే మరో పెద్ద పండగలా ఉంటుంది.
వరుడు తరపున వాళ్ళు వరుడిని, వధువు తరపున వాళ్ళు వధువును ఆట పట్టిస్తుంటారు.ఇటువంటివి పెళ్ళికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
ఇవి చాలా రోజుల వరకు మధుర స్మృతులుగా నిలుస్తాయి.ఎప్పుడైనా ఒకసారి చూసుకున్నప్పుడు మనసుకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది కూడా.
తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడికి వధువు షాకిచ్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
ఇక అసలు విషయంలోకి వస్తే కొద్ది నిమిషాలలో పెళ్లి జరుగుతుంది అనే సమయంలో వధువు దగ్గరికి వరుడు వెళ్లిన సమయంలో వధువును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే వధువు రూపంలో ఉన్నది అసలైన వధువు కాదు, వరుడి స్నేహితుడు అచ్చం వధువు రూపంలో ఏమాత్రం అనుమానం రాకుండా వచ్చి వరుడుకు షాక్ ఇచ్చారు.
ఇక అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూసాయని చెప్పవచ్చు.ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
నెటిజన్లను ఎంతగానో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.