ప్రస్తుత కాలంలో విద్యార్థుల నుంచి ప్రపంచ స్థాయి సంస్థల యజమానుల వరకు అందరూ వాడేది “జీమెయిల్“.జీమేయిల్ ఇప్పుడు అందరూ కలిగి ఉంటున్నారు.
ఫోన్ లో ఎలాంటి యాప్ యూజ్ చేయాలన్నా, ఏవైనా వెబ్ సైట్ చూడాలన్నా జీమేయిల్ ద్వారానే ఎక్కువగా లాగిన్ అవుతుంటాం.ఇంటర్వ్యూ కాల్స్, కంపెనీ మెసేజెస్ ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మనకు జీమెయిల్ కె వస్తుంది.
అందుకే మనం ప్రతిరోజు తప్పకుండా జీ మెయిల్ ను చెక్ చేస్తుంటాం.
గూగుల్ తన యూజర్ల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది.
ఒక్కోసారి గూగుల్ లో లేని కొన్ని ఫీచర్లను యాడ్ ఆన్స్ రూపంలో మనం పొందవచ్చు.యాడ్ ఆన్స్ ను ను డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు.యాడ్ ఆన్స్ వల్ల జీమెయిల్ వాడకంలో కొత్త అనుభూతిని పొందవచ్చు.అలాంటి కొన్ని యాడ్ ఆన్స్ గురించి తెలుసుకుందాం.
ఒకేసారి రెండు మూడు జీమెయిల్ అకౌంట్ లను వాడేవారికి ఈజీగా పని చేసుకోవడం కోసం ‘చెకర్ ప్లస్ ఫర్ జీమెయిల్‘ బాగా ఉపయోగపడుతుంది.
దీని సాయంతో అన్నిమెయిల్ ఐడీలకు వచ్చిన మెయిల్స్ ను ఒకే దగ్గర చూడొచ్చు.ఒకే చోట రిప్లైలు కూడా పంపొచ్చు.కొత్త మెయిల్స్ వచ్చినప్పుడు పాప్ అప్ కూడా వస్తుంది.
ఎవరికైనా మెయిల్ చేస్తే ఆ మెయిల్ కి సంబంధించిన అడిషనల్ మ్యాటర్ ను నోట్ చేసుకోవడానికి నోట్స్ ఫీచర్ ను ‘సింపుల్ జీమెయిల్ నోట్స్‘ అనే థర్డ్ పార్టీ యాడ్ ఆన్ ద్వారా పొందవచ్చు.
దీనిని యాడ్ చేసుకుంటే మెయిల్ చేసేటప్పుడు పైన నోట్ కనిపిస్తుంది.అందులో మీకు కావాల్సిన సమాచారం రాసుకోవచ్చు.ఆ ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే కనిపిస్తుంది.
మెయిల్ లో ఇంగ్లీష్ లో ఏదైనా రాసేటప్పుడు మిస్టేక్స్ వస్తుంటాయి.
అలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి గ్రామర్లీ యాడ్ ఆన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.మెయిల్ లో మనం రాస్తున్నప్పుడే అది మిస్టేక్స్ ను గుర్తించి యూజర్లను అలర్ట్ చేస్తుంది.అది సజెషన్స్ కూడా ఇస్తుంది.
వాటి నుండి మీకు కావాల్సిన పదాలను సెలక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు.ఇందులో ఫ్రీ గా అకౌంట్ తెరిచి సేవలు వినియోగించుకోవచ్చు.
మనం మెయిల్ చదివే స్థితిలో లేనప్పుడు దానిని వినాలనుకుంటే ‘డిక్టేషన్ ఫర్ గూగుల్‘ అనే ఓ యాడ్ ఆన్ ఉంది.ఈ యాడ్ ఆన్ సుమారు 60 లాంగ్వేజీలను సపోర్ట్ చేస్తుంది.
మనం వినాలనుకున్న మెయిల్ ను ఓపెన్ చేసి పైన ఉన్న మైక్ ఐకాన్ ను క్లిక్ చేస్తే అందులోని సమాచారాన్ని ఈ యాడ్ ఆన్ మనకు చదివి వినిపిస్తుంది.మనం మెయిల్ రాసేటప్పుడు కూడా ఈ యాడ్ ఆన్ ను ఉపయోగించుకోవచ్చు.
మీరు సెండ్ చేసిన మెయిల్ ను అవతలి వ్యక్తి చూశారా? లేదా? అనే సందేహం వచినప్పుడు.దాని కోసం మెయిల్ ట్రాక్ అనే యాడ్ ఆన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
దీన్ని జీమెయిల్‌లో యాడ్ చేసుకొని మెయిల్ చేస్తే.అవతలి వ్యక్తికి మెయిల్ వెళ్లినప్పుడు సింగిల్ టిక్, ఓపెన్ చేసి చూసినప్పుడు డబుల్ టిక్ కనిపిస్తాయి.
జీమెయిల్‌లో అడిషనల్ ఫీచర్లు ఇచ్చే ఇలాంటి యాడ్ ఆన్స్.అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌లో చాలా ఉంటాయి.వీలైతే ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి.