ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం గురించి అందరికి తెలిసిందే.ఎంతో మంది స్టార్ హీరోలతో దర్శకత్వం వహించి మంచి సక్సెస్ ను అందుకున్నాడు.
ఇప్పటికీ పలు సినిమాల్లో బిజీగా ఉన్న పూరి ఇటీవల కొన్ని విషయాలు పంచుకున్నాడు.అంతేకాకుండా అందమైన వెనిస్ నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు పూరి.
ఈ భూమ్మీద వెనిస్ నగరం అందమైనదని, ఇటలీకి ఉత్తరాన నిర్మించిన వెనిస్ ను ఒకప్పుడు వెణిజియా అని పిలిచే వారని తెలిపారు పూరి.118 చిన్న ద్వీపాలను కలుపుతూ సిటీని కట్టారని, ప్రతి ద్వీపానికి మధ్యలో చిన్నచిన్న కాల్వలు ఉంటాయని, ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లాలంటే పడవల తోనే ప్రయాణం అని తెలిపాడు.ఆ పడవలను గండోలా అంటారని, ప్రతి గండోలా 11 మీటర్ల పొడవు ఉంటుందని తెలిపాడు.అక్కడ ఎటువంటి బైకులు, కార్లు ఉండవని తెలిపాడు.
చరిత్రకారులు మార్కోపోలోది వెనిసేనన్నారు.అక్కడ చెత్తకుండీలు కూడా అందంగా ఉంటాయని తెలిపారు.అక్కడ కార్నివాల్ అతి పెద్ద పండుగ అని, ప్రతి ఒక్కరు అందమైన మాస్కులు పెట్టుకుని సంబరాలు చేసుకుంటారు అని తెలిపాడు.16వ శతాబ్దంలో ఈ పండుగ సందర్భంగా ఎవరైనా మాస్కు ధరించకుండా ఉంటే రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తారని, అంతే కాకుండా వాటిని స్తంభానికి కట్టేసికొట్టే వారని తెలిపారు.ప్రపంచంలో మొదటి కాసినో ఇక్కడే పెట్టారని.అంతే కాకుండా మొదటి మహిళ గ్రాడ్యుయేట్ ఇక్కడ చెందిన అమ్మాయి అని తెలిపాడు.
ఇక్కడ అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మారడంతో ప్రతి ఇల్లు హోటల్ గానో, రెస్టారెంట్ గానో మారిందని దానివల్ల స్థానికులకు ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైనది అని తెలిపారు.ఒకప్పుడు 20లక్షల వేలు ఉన్న జనాభా ఇప్పుడు 60 వేలకు పడిపోయిందని తెలిపారు.ప్రస్తుతం ఈ నగరం నీటిలో మునిగి పోతుందని.2030నాటికి దెయ్యాలు నగరంగా మారుతుందని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.