త్రివిక్రమ్ మహేష్ సినిమాలో మరొక అక్కినేని హీరో..!

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.

 Hero Sumanth In Mahesh Trivikram Movie, Trivikram, Mahesh Babu, Akkineni Sumanth-TeluguStop.com

ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

పరశురామ్ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారని సమాచారం.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయినా ఈ రెండు సినిమాల్లో మహేష్ లోని మరొక కోణాన్ని బయటకు తీసాడు త్రివిక్రమ్.

Telugu Sumanthmahesh, Mahesh Babu, Maheshtrivikram, Trivikram-Latest News - Telu

అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఆ మధ్య ఈ సినిమాలో ఇంకొక హీరో కూడా నటించ బోతున్నాడని వార్తలు వినిపించాయి.

ఈ విషయంలో ఇప్పుడు మరొక వార్త వస్తుంది.ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

సుమంత్ ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న ఇంకా గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు.తన కెరీర్ కు బూస్టప్ ఇచ్చే ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు రాలేదు.

చూడాలి మరి ఈ వార్త నిజమయితే సుమంత్ కెరీర్ కు ఈ సినిమా ఎంత వరకు ఉపయోగపడుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube