ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించిన కరోనా సెకండ్ వేవ్ తీరని నష్టాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఇలా భారత్‌లో నెలకొన్న పరిస్దితులను చూసి చివరికి ఉగ్రవాద దేశంగా పిలవబడుతున్న పాకిస్దాన్ కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్, ట్రీట్ మెంట్ ఎక్విప్ మెంట్స్, అక్సిజన్ వంటి వాటి కొరత వల్ల ప్రజలకు సమయానికి వైద్యం అందక కూడా నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ పరిస్దితుల పై ప్రతి పక్షాలు కేంద్రాన్ని ఘాటుగానే విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా భారత్‌లో నెలకొన్న పరిస్దితుల పై లాన్సెట్ జర్నల్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్‌ను అదుకుందాం రమ్మంటూ ‘ఎ కాల్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్షన్’ పేరుతో నిన్నటి సంచికలో ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది.
అంతే కాకుండా ఇందుకు గాను 8 సూచనలు కూడా చేసింది.
ఇందులో భాగంగా టీకాలు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, విరాళంగా ఇవ్వడం.
మురికివాడల్లోని ప్రజలకు నాణ్యమైన మాస్కులు, పల్స్ ఆక్సీమీటర్లు, ఆహారం అందించడం తో పాటుగా ఆర్థిక చేయూత నివ్వడం.సంపన్న దేశాల్లో ఉన్న టీకాలు భారత్‌కు పంపడం.వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించేందుకు భారత్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు తెలపడం.వైద్యులపై ఒత్తిడి తగ్గించడం.
భారత్‌లో పనిచేసేందుకు విదేశీ వైద్య నిపుణులకు కేంద్రం తాత్కాలిక లైసెన్సులు ఇవ్వడం.అంతర్జాతీయ సమాజం అత్యవసర మందుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటం.
ప్రయాణాలపై ఆంక్షలు విధించడం.భారత్ నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌కు పంపడం.
భారత్‌లో కరోనా కేసులు, మరణాలు కచ్చితంగా నమోదయ్యేలా చూడడం.రీ ఇన్‌ఫెక్షన్ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో దేశాలన్నీ ముందుకొచ్చి భారత్‌లో విస్తరిస్తున్న మహమ్మారిని అష్టదిగ్బంధనం చేయాలని కోరింది.