నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా హ్యాట్రిక్ మూవీగా రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది.ఇందులో శ్రీకాంత్ బాలకృష్ణకి విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
అలాగే ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు.ఇందులో బాలకృష్ణ ఏకంగా మూడు భిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఉండటం విశేషం.
అందులో ఇది వరకు తెలుగు సినిమాలో ఎన్నడూ చూడని విధంగా అఘోరా పాత్ర కూడా ఉండబోతుంది.ఈ మధ్య బాలకృష్ణ అఘోరా లుక్ అంటూ కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి.
అయితే వాటిలో వాస్తవం ఎంత అనేది తెలియదు.ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో త్వరలో ఈ సినిమా టైటిల్ పై జరుగుతున్న చర్చకి బోయపాటి ఫుల్ స్టాప్ పెట్టె పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఉగాదికి నందమూరి అభిమానులకి కానుకగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
దీంతోపాటు ఈ టైటిల్ పోస్టర్ ని జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.బోయపాటి, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో దమ్ము సినిమా వచ్చింది.అదే సమయంలో ఈ మధ్య బాబాయ్, అబ్బాయ్ మధ్య సత్సంబంధాలు మెరుగయ్యాయి.
ఈ నేపధ్యంలో టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను తారక్ చేతుల మీదుగా విడుదల చేయించాలని దర్శకుడు బోయపాటి ట్రై చేస్తున్నట్లు బోగట్టా.జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనికి సంమతంగానే ఉన్నాడని తెలుస్తుంది.
త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.