అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది.ఇది వాహనాల ప్రమాదం కాదు.
వాయు ప్రమాదం.ఆ వివరాలు చూస్తే.
ఐదుగురు ప్రయాణికులతో వెళ్లుతున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురవగా ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులతో పాటుగా పైలట్ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఇకపోతే యాంకరేజ్ నగరానికి సమీపంలో ఉన్న క్నిక్ గ్లేషియర్ను (హిమనీనదం) ను హెలికాప్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అలాస్కా స్టేట్ ట్రూపర్స్ ప్రతినిధి ఆస్టిన్ డేనియల్ వెల్లడించారు.
ఇక ఈ ప్రమాదం పై జాతీయ రవాణా భద్రతా మండలి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఘటనాస్దలికి వెళ్లిన అలాస్కా ఆర్మీ నేషనల్ గార్డ్స్, మౌంటెయిన్ రెస్క్యూ బృందాలకు ఐదుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయని, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు కనుగొన్నారని సమాచారం.
ఇక ఈ ప్రమాద ఘటనతో విమాన రాకపోకలపై ఆ ప్రాంతంలో ఫెడరల్ ఏవియేషన్ తాత్కాలికంగా ఆంక్షలు విధించినట్లుగా అధికారులు వెల్లడించారు.