ప్రస్తుత కాలంలో రోజురోజుకు సగటు మనిషి ఆయుర్ధాయంఅనేది తగ్గిపోతోంది.ప్రస్తుతం తింటున్న ఆహారపదార్థాలు, పీలుస్తున్న గాలి, మానసిక ఒత్తిడి ఒక కారణంగా చెప్పవచ్చు.
అయితే ఈ కాలంలో వంద సంవత్సరాలు బ్రతకడం అంటే సాధ్యం కాని పని.ఇప్పటికీ ఎవరైనా వందేళ్లు బ్రతికారంటే వారు పాత కాలానికి చెందిన వారై ఉంటారు.ఎందుకంటే అప్పటి ఆహార అలవాట్లు, వాతావరణ సమాచారం, ఒత్తిడి లేని జీవితాలు, ఉమ్మడి కుటుంబం ఇలా ఆనందంగా గడిపేవారు.అందుకే వాళ్లు ఇలా ఇన్నేళ్లు జీవించారు.అయితే ప్రస్తుతం కాలంలో అందరికంటే ఎక్కువ ఆయుర్ధాయం కలిగి ఉంటున్న వాళ్ళు జపాన్ దేశస్తులు.మరి తాజాగా జపాన్ లో ఓ వ్యక్తి 112 ఏళ్ళు బ్రతికి గిన్నీస్ రికార్డ్ సాధించాడు.
అయితే ఇప్పటికీ జపాన్ మహిళల సగటు వయసు 87 సంవత్సరాలు.అయితే మరి ఇంతలా జపాన్ ప్రజలు ఆర్థిక వయస్సు ఇంతలా పెరగడానికి జపాన్ ప్రజలు మంచి సూత్రాలు పాటిస్తున్నారు.
వాళ్లు సాత్విక ఆహారం తీసుకుంటూ, ఎక్కువ వ్యాయాయం, నూతన పోకడలకు దూరంగా ఉంటూ తమ సంస్కృతిని కాపాడుకుంటూ చాలా ఆనందంగా జీవిస్తారు.అంతేకాకుండా మితాహారం తీసుకుంటూ 80 శాతం మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని ఎక్కువ శాతం కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
అందుకే వాళ్ళు ఆయుర్దాయం పెరగడానికి గల ప్రధాన కారణంగా తెలుస్తోంది.