మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు.ఔట్ అండ్ ఔట్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే త్రివిక్రమ్ గత చిత్రం అయిన అరవింద సమేతలో పెంచల్ దాస్ అనే ఫోక్ సింగర్‌కు అదిరిపోయే అవకాశం ఇచ్చాడు.చిత్తూరు యాసతో తనదైన పాటలను పాడి ప్రేక్షకులను మెప్పిస్తున్న పెంచల్ దాస్‌ను మరోసారి తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రంలో త్రివిక్రమ్ పెంచల్ దాస్‌తో ఓ అదిరిపోయే ఫోక్ సాంగ్‌ను పాడించాలని చూస్తున్నాడు.కాగా అరవింద సమేత చిత్రంలో రెడ్డమ్మ తల్లి అనే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఇదే తరహాలో ఇప్పుడు త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా ఓ ఫోక్ సాంగ్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.
మొత్తానికి పెంచల్ దాస్ పాటలకు త్రివిక్రమ్ బాగా కనెక్ట్ కావడమే కాకుండా ఆయన పాటలు ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటుండటంతో, మరోసారి పెంచల్ దాస్‌కు అవకాశం ఇస్తున్నాడు త్రివిక్రమ్.
ఇక తారక్ 30వ చిత్రానికి అయినను పోయిరావలె హస్థినకు అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో తారక్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాకు త్రివిక్రమ్ ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
కాగా ఈ సినిమా షూటింగ్‌ను అతిత్వరలో ప్రారంభించేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.