టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే.ఆయన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తన నిర్మాణంతో తెలుగు సినిమాల్లో మంచి విజయాలను అందుకున్నాడు.
ఎన్నో సినిమాలలో నిర్మాతగా చేసిన దిల్ రాజ్.అదే స్థాయిలో మరిన్ని సినిమాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే దిల్ రాజ్ ఇటీవల ఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కొన్నాడు.
దిల్ రాజ్ కు సినీ పరిశ్రమలో ఎంతోమంది వ్యతిరేకస్తులు ఉన్నారు.
ఆయన తన రంగంలో కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు.ఇటీవలే క్రాక్ సినిమా విడుదల సందర్భంగా యువ పంపిణీదారుడు వరంగల్ శీను తనపై మండిపడ్డాడు.
అతను ఇలా చేయడానికి కారణం అతని వెనుక ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చింది.ఈయన చేసిన వీరంగానికి సినీ పరిశ్రమలో కొంత మంది జై కొట్టగా.
మరికొంతమంది దిల్ రాజు వైపు మాట్లాడారు.

క్రాక్ సినిమా కంటే ముందు కొన్ని సినిమాల తేదీలు విడుదల కాగా.థియేటర్ లో సినిమాల విడుదల అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి.కానీ క్రాక్ సినిమా విడుదల చేసే సమయం కంటే ముందుగానే విడుదలైన సందర్భంగా థియేటర్ లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ విషయం గురించి కొందరు దిల్ రాజు పట్ల అసహనం చూపించగా.మరి కొందరు అంతమాత్రాన దుయ్యబట్టవలసిన అవసరం లేదని కొందరు ఎగ్జిబిటర్లు కూడా తెలిపారు.కానీ దిల్ రాజు పై వరంగల్ శీను అంతగా విరుచుకుపడటంతో.దిల్ రాజు మాత్రం సంయమనం పాటించి, తనదైన వ్యక్తిత్వంతో వ్యవహరించాడంటూ కొందరు తెలిపారు.
ఈ విధం గా ఎదుగుతున్న సమయంలో తాను సమస్యలను ఎదుర్కొంటున్నారని, అన్నిటినీ తట్టుకుని నిలబడి ఉన్నప్పుడే అనుకున్న స్థాయికి చేయగలమని వరంగల్ శీను కు దిల్ రాజ్ హితవు పలికారని సీనియర్ ఎగ్జిబిటర్ ‘చిత్ర జ్యోతి’కి తెలిపాడు.కానీ ఇవన్నీ పక్కనబెట్టి దిల్ రాజు తన సొంత పనుల్లో బిజీగా ఉన్నాడు.
కానీ ఈ విషయం పట్ల దిల్ రాజ్ కాస్త అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
చిత్ర జ్యోతి ఈ విషయం గురించి దిల్ రాజుతో మాట్లాడగా ఆయన నవ్వుతూ సమాధానం ఇస్తూ ‘పళ్ళున్న చెట్టుకే రాళ్ళు, ఎండిపోయిన చెట్టుకి ఎవరు రాళ్లు విసరరు.
ఆ నిజాన్ని నేను ఎప్పుడు మర్చిపోను.గిల్డ్ అంటే కౌన్సిలో, చాంబరో కాదు.
గిల్డ్ అన్నది అందరం కలిసి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వేదిక అంటూ, అయినా దిల్ రాజు మీద రాస్తే చదువుతారు కానీ, ఏ అల్లయ్యో, పుల్లయ్యో మీద రాస్తే చదవరు కదా’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.