తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన నటన గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.అంతేకాకుండా బాలకృష్ణ ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.
నాటి నుండి నేటి వరకు తన నటనలో ఎలాంటి మార్పు లేకుండా హీరో గా ఎంట్రీ ఇస్తూ మంచి విజయాలను సాధించుకున్నాడు.తన నటనకు మంచి అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటిస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతి ఒక్క సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈయన కొన్ని సినిమాల్లో నటించి షూటింగ్ మధ్యలో ఆపేసిన సినిమాలు కూడా ఉన్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో నటించిన బాలకృష్ణ ఈ సినిమాకు ముందే భగవాన్ శ్రీ కృష్ణ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది.కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది.

అంతేకాకుండా ఎన్టీఆర్ హీరోగా నటించిన సమ్రాట్ అశోక చిత్రంలో బాలకృష్ణ కొన్ని పాత్రలు చేసే అవకాశం వచ్చింది.కానీ బాలకృష్ణ ఆ సమయంలో వేరే షూటింగ్ లో బిజీగా ఉన్నందున మోహన్ బాబు నటించారు.ఇది కాక సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భైరవ ద్వీపం సినిమాలో నటించిన బాలకృష్ణ దాదాపు ఈ సినిమా పూర్తయ్యే సమయం లో ఈ సినీ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి మరణించారు.

దీంతో ఆయన కొడుకు ఇది బ్యాడ్ సెంటిమెంటు గా భావించి ఈ సినిమాను మధ్యలో ఆపేశారు.అంతేకాకుండా సొంత దర్శకత్వంలో నర్తనశాల సినిమాలో బాలకృష్ణ షూటింగ్ ను మొదలుపెట్టగా సౌందర్య హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించడంతో అందులో ద్రౌపది పాత్ర మరే హీరోయిన్ దొరక్కలేనందున ఈ సినిమాను కూడా మధ్యలో ఆపేశారు.ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో హర హర మహాదేవ సినిమా లో నటిస్తానని తెలపగా సినిమా కథ నచ్చలేదని పక్కన పెట్టేశారు.కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే సినిమాలో చేద్దాం అనుకోగా ఇందులో రాష్ట్రపతి క్యారెక్టర్ ను అమితాబచ్చన్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.అంతేకాకుండా దాసరి నారాయణరావు దర్శకత్వంలో శివరంజని అనే సినిమాలో ముందుగా బాలకృష్ణ ను హీరోగా ఎంచుకోగా ఎన్టీఆర్ ఈ పాత్రలో బాలయ్య నటిస్తే బాగుండదని తెలిపాడు.
అంతేకాకుండా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మరో సినిమాలో నటించే అవకాశం రాగా ఇంతవరకు ఆ సినిమా గురించి ఎటువంటి సమాచారం లేదు.ఇలా తన కెరీర్ లో మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయని అర్థమవుతుంది.