సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ధనుష్ఓ వైపు కమర్షియల్ సినిమాలు, మరో వైపు ప్రయోగాత్మక కథలతో కూడా సినిమాలు చేసే ధనుష్ కోలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు.ఇక ధనుష్ టాలెంట్ సౌత్ కి మాత్రమే పరిమితం కాలేదు.
ఇప్పటికే బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ రెండు సినిమాలు చేసేశాడు.అదే పనిలో హాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేశాడు.
సౌత్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత హాలీవుడ్ నటించిన నటుడుగా ధనుష్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ అనే ఇంగ్లీష్ సినిమాతో ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.ఇప్పుడు మరో మరోసారి హాలీవుడ్ మూవీకి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అవెంజర్స్, ఎండ్ గేమ్ సినిమాలను తెరకెక్కించిన దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ధనుష్ కీలకపాత్రలో నటించనున్నాడు.ఈ చిత్రానికి ది గ్రే మ్యాన్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది.
పూర్తి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఈవెన్స్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ఇండియన్ బ్యాగ్రౌండ్ ఉన్న నటుడు కోసం వెతుకుతున్న క్రమంలో ధనుష్ చేసిన హాలీవుడ్ సినిమా చూసిన రుస్సో బ్రదర్స్ అతనిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా షూటింగ్ కోసం ధనుష్ రెండు నెలలపాటు అమెరికాకు మకాం మార్చనున్నాడు.ఈ నెలలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.