ఎర్ర ఎర్రగా ఉండే టమాటాలు చూసేందుకు అందంగా, తినేందుకు రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.ఎన్నో పోషకాలు దాగి ఉండే టమాటాలు అనేక జబ్బులను కూడా దూరం చేస్తాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే కూరగాయల్లో టమాటాలు ముందు వరసలో ఉంటాయి.అయితే కేవలం టమాటాలే కాదు టమాటా విత్తనాలు కూడా ఆరోగ్యానికి గ్రేట్‌గా ఉపయోగపడతాయి.
కానీ, చాలా మంది టమాటా విత్తనాల యొక్క ప్రయోజనాలు తెలియవు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.
టమాటా విత్తనాలు తీసి ఎండి బెట్టుకుని వాడుకోవాలి.లేదా ఎండ బెట్టుకున్న విత్తలను పొడి వంటల్లో వాడుకోవచ్చు.అయితే టమాటా విత్తనాలు తీసుకోవడం వల్ల.అందులో పాలు లక్షణాలు గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులను దరి చేరకుండా రక్షిస్తాయి.
అలాగే రక్తం గడ్డకట్టడం నిరోధించడంలో టమాటా విత్తనాలు అద్భుతంగా సహాయపడతాయి.కొందరు రక్తం గడ్డకట్టే ప్రమాదాలను తగ్గించుకునేందుకు ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడుతుంటారు.
కానీ, వాటికి బదులుగా టమాటా విత్తనాలు తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.కడుపు అల్సర్‌తో బాధ పడే వారు టమాటా విత్తనాలు తీసుకుంటే.త్వరగా సమస్య దూరం అవుతుంది.టమాటా విత్తనాల్లో ఫైబర్ కూడా ఉంటుంది.
కాబట్టి, టమాటా విత్తనాలు తరచూ తీసుకుంటూ ఉంటే జీర్ణ సమస్యలు ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.
ఇక టమాటా విత్తనాలు ఆరోగ్య పరంగానే కాకుండా.సౌందర్య పరంగా కూడా ఉపయోగపడతాయి.మొటిమలు, నల్ల మచ్చలతో బాధ పడేవారు టమాటా విత్తనాల పౌడర్‌లో చిటికెడు పసుపు, కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల తర్వాత కోల్డ్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు సార్లు చేస్తే.మొటిమలు, మచ్చల సమస్య దూరం అవుతుంది.
.