నేటి అధునిక కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు.అయితే సాధారణంగా చాలా మంది తమకు తెలియకుండానే బరువు పెరిగిపోతారు.
ఎవరో ఒకరు చెప్పే వరకు బరువు పెరిగిపోయామన్న సంగతి వారికి తెలియదు.బరువు పెరగడానికి కారణాలు అనేకం.
వ్యాయామాలు చేయకపోవడం, ఆహారపు అలవాట్లు, జీవన శైలి, మద్యం అలవాటు, థైరాయిడ్ ఇలా వివిధ కారణాల వల్ల బరువు పెరుగుతారు.
అయితే అదనపు బరువును తగ్గించడంలో సొరకాయ అద్భుతంగా సహాయపడుతుంది.
సొరకాయలో ఫైబర్ మరియు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.కేలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి.
అలాగే సొరకాయ తీసుకోవడం వల్ల ఎక్కువడ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.దాంతో వేరే ఆహారాలను తీసుకోలేదు.
ఫలితంగా బరువు తగ్గుతారు.కాబట్టి, ప్రతి రోజు సొరకాయతో రసం చేసుకుని.
తీసుకుంటే గనుక సులువుగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రసం తాగలేమని భావించే వారు అయితే సలాడ్స్, కర్రీ రూపంలో అయినా సొరకాయను తీసుకోవచ్చు.ఇలా తీసుకున్నా శరీరంలో కొవ్వు కరుగుతుంది.ఇక సొరకాయను తగిన మోతాదులో రెగ్యులర్‌గా తింటే.
చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.ముఖ్యంగా సొరకాయలో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు.
చర్మంపై ముడతలు, మచ్చలు వంటివి పోగొట్టి ప్రకాశవంతంగా మారుస్తుంది.
మద్యం అలవాటు ఉన్న వారు ఖచ్చితంగా సొరకాయతో తయారు చేసిన జ్యూస్‌ను తీసుకోవాలి.
ఎందుకంటే, సొరకాయలు ఉండే వాటర్ కంటెంట్ మరియు మినరల్స్ లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.అంతేకాకుండా, మూత్ర పిండాల్లో ఏమైనా సమస్యలు ఉంటే గనుక.వాటిని అరికట్టి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.సో.సొరకాయను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా.రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోండి.