గత కొన్ని రోజుల నుంచి శ్రీముఖి ఒక వ్యక్తిని ప్రేమించిందని.ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
ఆ వార్తలపై శ్రీముఖి స్పందించకపోవడంతో శ్రీముఖి ప్రేమ, పెళ్లి వార్తలను ఆమె అభిమానులు కూడా నిజమేనని నమ్మారు.ప్రస్తుతం క్రేజీ అంకుల్స్ సినిమాలో నటిస్తున్న శ్రీముఖి ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ పెళ్లి వార్తలపై స్పందించి స్పష్టతనిచ్చారు.
తన పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీముఖి అన్నారు.ప్రస్తుతానికి తాను సింగిల్ అని.అయితే ప్రేమించే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పారు.మంచి అబ్బాయి పరిచయమైతే ఆ అబ్బాయితో, అబ్బాయి కుటుంబంతో రెండు మూడు సంవత్సరాలు ట్రావెల్ చేసి.
ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుంటానని అన్నారు.మూడు సంవత్సరాల తరువాతే తన పెళ్లి జరుగుతుందని.
ఎవరైనా నచ్చితే తానే చెబుతానని తెలిపారు.
గతంలో తనకు పెళ్లి ఆలోచనలు వచ్చాయని గ్యాప్ లేకుండా టీవీ షోలు చేస్తున్న సమయంలో సరిగ్గా నిద్రపోయేదాన్ని కాదని అన్నారు.
ఆ సమయంలో పేరెంట్స్ కు ఫోన్ చేసి రోబోలాంటి జీవితాన్ని తాను గడపలేనని పెళ్లి చేసేయమని కోరానని చెప్పారు.అయితే మనిషి జీవితంలో సమయాన్ని బట్టే అన్నీ జరుగుతాయని టైం వస్తే తన పెళ్లి కూడా జరుగుతుందని వెల్లడించారు.
తనకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయని.పెళ్లైన తరువాత భర్తపై ఆధారపడి జీవించడం తనకు నచ్చదని సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని తెలిపారు.
డబ్బు విషయంలో పిసినారిగా వ్యవహరించనని, వృథాగా ఖర్చులు కూడా చేయనని శ్రీముఖి చెప్పారు.వుమేనియా షోకు తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నానని ఆ షోకు సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటున్నానని శ్రీముఖి అన్నారు.