సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమా నిర్మించడం అంటే ఎన్నో ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారమనే సంగతి తెలిసిందే.సినిమా హిట్టైతే లాభాలు ఏ విధంగా ఉంటాయో ఫ్లాప్ అయితే నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి.
స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి నష్టాలపాలై ఇండస్ట్రీకి దూరమైన నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు.అలా 13 ఏళ్ల క్రితం డిజాస్టర్ అయిన సినిమాకు ఇప్పటికీ అప్పులు కడుతున్నానని నిర్మాత చెప్పుకొచ్చారు.
2007 సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ హీరోగా స్నేహ, మీరాజాస్మిన్ హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన మహారథి సినిమా విడుదలైంది.శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్ బ్యానర్ పై వాకాడ అప్పారావు ఈ సినిమాను నిర్మించారు.మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే చెత్త సినిమాగా నిలిచింది.
కథ, కథనం సరిగ్గా లేకపోవడం దర్శకత్వ లోపాలు సినిమా పరాజయానికి కారణమయ్యాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహారథి సినిమా అప్పులు తాను ఇప్పటికీ కడుతున్నానని వాకాడ అప్పారావు చెప్పుకొచ్చారు.
కొందరు ఫైనాన్షియర్లు ముందుకు రావడంతో మహారథి సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చానని.అయితే సినిమా ప్రారంభం అయిన తరువాత ఫైనాన్షియర్లు సహాయసహకారాలు అందించకుండా వెనక్కు తగ్గారని ఆయన చెప్పుకొచ్చారు.
ఫైనాన్షియర్లు ఊహించని విధంగా వెనక్కు తగ్గడంతో సినిమా నిర్మాణం కోసం డబ్బులు సమకూర్చుకునే పనిలో పడ్డానని.అందువల్ల సినిమా కథ, కథనంపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయానని చెప్పారు.
ఒక స్నేహితుడు సినిమా నిర్మాణం కోసం డబ్బు సహాయం చేశాడని.సినిమాకు నష్టాలు రావడంతో ఇప్పటికీ అప్పులు కడుతున్నానని నిర్మాత చెప్పుకొచ్చారు.
వాకాడ అప్పారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల క్రితం తీసిన సినిమాల అప్పులు ఇప్పటికీ కడుతున్న నిర్మాతలు ఎంతో మంది ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.