హాలీవుడ్ సినిమా పరిశ్రమ అంటే అందరికీ ముందుగా యాక్షన్ మరియు అడ్వెంచర్స్ సినిమాలే గుర్తుకు వస్తాయి.కానీ అలాంటి చిత్రాల వెనుక ఎంతో మంది టెక్నీషియన్ల కష్టం, కృషి ఉంటుంది.
అయితే ఇందులో మేకప్ ఆర్టిస్టులు నటీనటుల కోసం ఎంతగా శ్రమిస్తారో కొత్తగా ప్రేక్షకులకి చెప్పనవసరం లేదు.అయితే తాజాగా పలు హాలీవుడ్ చిత్రాలకి ఫేషియలిస్ట్ గా పని చేసినటువంటి ప్రముఖ ఫేషియలిస్ట్ లూయిస్ ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.
ఇందులో భాగంగా హాలీవుడ్ నటీనటులు అందంగా కనిపించడం కోసం చేయించుకునే ఫేషియల్ గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.ఇందులో ముఖ్యంగా కొంతమంది హాలీవుడ్ సెలబ్రిటీస్ అందంగా కనిపించడం మరియు ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం వీర్యంతో ఫేషియల్ చేయించుకుంటారని తెలిపింది.
దీంతో ఒక్కసారిగా అభిమానులు ఖంగు తిన్నారు.అయితే ఇలా అందంగా కనిపించడం కోసం వీర్యంతో ఫేషియల్స్ చేయించుకునే వారిలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారని తెలిపింది.
అయితే ఈ విషయాన్ని గతంలో కొందరు చర్మ నిపుణులు వైద్యులు కూడా వీర్యంలో ఉండేటువంటి “స్పెర్మిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్” చర్మం కాంతి వంతంగా కనిపించడానికి ఎంతో ఉపయోగ పడుతుందని ప్రయోగాత్మకంగా నిరూపితం చేశారు.దీంతో అప్పట్లో ప్రముఖ నటి మరియు మోడల్ షెర్లిన్ చోప్రా కూడా అందంగా కనిపించడం కోసం వీర్యం తో అప్పుడప్పుడు ఫేషియల్ చేయించుకొనేదని ఆమె పలు సందర్భాలలో బహిర్గతంగా కూడా వెల్లడించింది.