యువతతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఇప్పటికే పలు దేశాల్లో రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.కరోనా వ్యాప్తితో పాటు మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే వస్తోంది.
ఆయా దేశాల పరిశోధకులు, శాస్త్రవేత్తలు కరోనా నియంత్రణకు, వ్యాప్తికి సంబంధించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.పలువురు ప్రముఖులు తమ ఆలోచనలను పంచుకుంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) యూరప్ చీఫ్ డాక్టర్ హన్స్ క్లూగ్ కరోనా గురించి కొత్త విషయాలను తెలియజేశారు.కరోనా వైరస్ సుడిగాలిలాంటిదని, యువతలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.
వీరి వల్ల ఇళ్లలో ఉండే వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని, మరణాలు కూడా సంభవించవచ్చని పేర్కొన్నారు.ముసలివాళ్లు యువతతో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
దక్షిణ కొరియాలో నిన్న ఒక్కరోజే 441 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఆ దేశంలో లాక్ డౌన్ విదించవచ్చని తెలిసింది.
గత 14 రోజుల్లో దేశంలో కొత్తగా 4000 కేసులు నమోదయ్యాయని, సియోల్ లో వైరస్ సోకిన వారిని గుర్తించడం కష్టంగా మారిందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది.కేసులు పెరుగుతుండటంతో సియోల్ లోని నేషనల్ అసెంబ్లీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.