అడల్ట్ సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని పేరు మియా ఖలీఫా.అడల్ట్ సినిమాలు చేసే వాళ్ళకి ఆమె భాగా తెలుస్తుంది.
ఆ రంగంలో ఉన్నదీ ఆమె కొద్ది కాలమే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అదే సమయంలో అడల్ట్ సినిమాలలో నటించినందుకు ముస్లిం వర్గాల నుంచి, ఐఎస్ఐఎస్ నుంచి కూడా బెదిరింపులని ఎదుర్కొంది.
ఆ బెదిరింపులకి భయపడే ఆమె ఆ ఇండస్ట్రీని వదిలేసింది.ప్రస్తుతం ఏదో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
సోషల్ మీడియాలో ఈమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఈ అడల్ట్ ఇండస్ట్రీలో ఉన్నవారికి చాలా గొప్ప మనసు ఉంటుందని సన్నీ లియోన్ తరహాలో మియా ఖలీఫా కూడా రుజువు చేసుకుంది.
తాజాగా ఆమె ఓ స్వచ్చంద కార్యక్రమం కోసం రెడ్ క్రాస్ తో భాగస్వామ్యం అయ్యింది.
అయితే ఆమె తాజాగా నన్ను బుక్ చేసుకోండి అని ఓ స్టేట్ మెంట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారడంతో చాలా మంది అసలు విషయం ఎంటా అని వెతికి చూశారు.చూసిన తర్వాత ఆమె గొప్ప మనసుకి ఫిదా అయిపోయారు.కొన్ని రోజుల క్రితం లెబనాన్ లోని బైరూత్ లో చోటు చేసుకున్న బాంబు పేలుడు వల్ల వేలాది మంది నష్టపోయిన విషయం తెల్సిందే.వారికి సాయం చేసేందుకు మియా ఖలీఫా ముందుకు వచ్చింది.
రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ఛారిటీ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.డబ్బులు ఇచ్చి తనను బుక్ చేసుకుంటే వారు ఎవరికి అయినా బర్త్ డే విషెస్ చెప్పాలనా, లేదంటే మాజీ ప్రియుడు లేదా ప్రేయసితో మాట్లాడాలన్నా కూడా తాను మాట్లాడుతాను అంటూ ప్రకటనలో పేర్కొంది.
దాని కోసం ఎంత చార్జ్ చేస్తుందో కూడా పేర్కొంది.ఇలా వచ్చిన సొమ్ము మొత్తం రెడ్ క్రాస్ ద్వారా బాధితుల సహాయార్ధం ఉపయోగించనున్నట్లు తెలిపింది.