ఏదో పాత్ర డిమాండ్ చేసింది కదా అని అలాంటివి చేస్తే... ప్రతీసారీ...

తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించినటువంటి రక్త చరిత్ర చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ సరసన నటించి తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధిక ఆప్టే గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు ఎప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది.

 Radhika Apte, Bollywood Actress, Bold Characters Offers, Bollywood,-TeluguStop.com

తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం బాగానే ఆకట్టుకుంది.తెలుగులో ఈ అమ్మడు నటించిన టువంటి రక్త చరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

కానీ ఏమైందో ఏమో ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు తెలుగు పరిశ్రమ వైపు అసలు చూడడం లేదు.

ఈ అమ్మడు అప్పట్లో పలు చిత్రాలలో కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించింది.

అయితే ఆ సన్నివేశాలు రాధిక ఆప్టే కి మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.దాంతో దర్శక నిర్మాతలందరూ రాధిక ఆప్టే కేవలం బోల్డ్ తరహా పాత్రలు మాత్రమే చేస్తుందని ముద్ర వేశారు.

 దీంతో తన నటనను నిరూపించుకొకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు మరియు బాలీవుడ్ లో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ విషయంపై తాజగా  రాధిక ఆప్టే స్పందించింది.

ఇందులో భాగంగా కొన్ని చిత్రాల్లో పాత్రలు డిమాండ్ చేశాయని అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని దాంతో ఈ మధ్యకాలంలో తనకి ఎక్కువగా అలాంటి సన్నివేశాలకు సంబంధించిన ఆఫర్లు వస్తున్నాయని వాపోతోంది.అంతేగాక తాను కేవలం బోల్డ్ సన్నివేశాల్లోనే కాక ఇతర రకాల పాత్రలను కూడా చేయగలనని కానీ దర్శక నిర్మాతలకి ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమా అవకాశాలేమీ లేవు.దీంతో రాధిక ఆప్టే సినిమా అవకాశాలు లేక ఖాళీగా గడుపుతోందట.

అంతేగాక ఇటీవల కాలంలో రాధిక ఆప్టే ఓ ఇంగ్లీష్ సినీ పరిశ్రమకు చెందిన వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఈ మధ్యకాలంలో  కొందరు నటీనటులు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వెబ్ సీరీస్ లలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.

దీంతో రాధిక ఆప్టే కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube