యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత చేసిన సాహో చిత్రం కోసం యావత్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే.ఆ సినిమా రిలీజ్ తరువాత మిశ్రమ స్పందన లభించడంతో తన నెక్ట్స్ మూవీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రభాస్.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన ప్రభాస్, ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంలో బిజీగా మారాడు.
జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాలో మరోసారి ప్రభాస్ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను మనకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్.
గత కొంత కాలంగా పూర్తి యాక్షన్ సినిమాలకే పరిమితమైన ప్రభాస్, ఈసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో మనముందుకు రానున్నాడు.
దీనికి సంబంధించి ఓ భారీ రొమాంటిక్ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్.
ఈ సెట్స్‌లో ప్రభాస్ హీరోయిన్‌తో కలిసి రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఓ పాటను కూడా తెరకెక్కించనున్నాడు.మరి ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకోగలడా లేదా అనేది చూడాలి.