జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు మద్దతుగా గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.ఈ సమయంలోనే వైకాపా నాయకులు పవన్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలో అమరావతి రాజధాని వద్దంటూ మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నట్లుండి అమరావతిపై ఇంతగా ప్రేమ కురిపించడం ఏంటో అంటూ ఎద్దేవ చేశారు.గతంలో రాజధానిగా అమరావతి వద్దే వద్దు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు దేశం ఆడించినట్లుగా ఆడుతూ అమరావతి రైతులకు మద్దతు అంటూ డ్రామాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు.
వైకాపా నేతలు తనపై చేస్తున్న విమర్శలకు పవన్ స్పందించాడు.తాను అమరావతిని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు అన్నాడు.రైతుల నుండి బలవంతంగా భూములను తీసుకోవద్దని మాత్రమే నేను మొదటి నుండి చెబుతూ వచ్చాను.రాజధాని నిర్మాణంకు 33 వేల ఎకరాల భూమి అవసరం లేదు అనేదే తన ఉద్దేశ్యం అని, రాజధానిగా అమరావతి ఉండటంను తాను ఎప్పుడు వ్యతిరేకించలేదు అన్నాడు.
తెలుగు దేశం పార్టీ నాయకులు పలువురు ఇన్ సైడర్ ట్రేడింగ్లకు పాల్పడ్డట్లుగా ప్రభుత్వం వారు అంటున్నారు.అదే నిజం అయితే సాక్ష్యాలు ఉంటే వెంటనే వారిపై కేసులు పెట్టవచ్చు కదా అంటూ పవన్ ప్రశ్నించాడు.
అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అంటూ పవన్ హెచ్చరించాడు.