అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న కమలా, కారణం ఏమిటంటే

వచ్చే ఏడాది అగ్రరాజ్యం అమెరికా లో జరగనున్న అధ్యక్షా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి గట్టి పోటీదారుగా నిలుస్తుంది అని భావించిన భారతీయ సంతతి మహిళ సెనేటర్ కమలా హ్యారిస్ అనూహ్యంగా ఈ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.తన మద్దతు దారులకు ఇది బాధాకరమైన విషయమని కానీ పోటీ లో కొనసాగడానికి ఆర్ధిక పరమైన ఇబ్బందులు కారణమని ఆమె మంగళవారం తెలిపారు.

 Kamala Harries Us Presidency-TeluguStop.com

తన ప్రచారాన్ని మంగళవారం తో ముగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.డెమోక్రటిక్ పార్టీ లో కీలక నేతగా మారిన కమలా 2020 అధ్యక్ష ఎన్నికల్లో గట్టి పోటీదారుగా నిలిచారు.

అయితే ఆర్ధిక పరమైన ఒత్తిళ్లు కారణంగా ఆమె తన పోటీని కొనసాగించలేనని ఇది తన మద్దతుదారులకు చాలా బాధాకరమైన విషయం అని ఆమె ప్రకటించారు.నేను బిలియనిర్ ను కాదు సొంత ప్రచారానికి నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, అందుకే ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

భారత సంతతికి చెందిన కమలా సెనెటర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ సంతతి మహిళ గా చరిత్రకెక్కారు.భారత సంతతి మహిళ అయిన కమలా హ్యారిస్ కు మొదటి లో అనూహ్యంగా మద్దతు లభించింది.

ఆమె మద్దతు ను చూసి అందరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు గట్టి పోటీదారుగా నిలుస్తుంది అని అందరూ భావించారు.కానీ అక్కడి నిబంధనల ప్రకారం ఆర్ధిక పరంగా ప్రచారానికి కావాల్సిన నిధులను వారే సమకూర్చుకోవలసి ఉంటుంది.

Telugu Kamala, Telugu Nri Ups, Presidency-

అయితే కారణంగానే ఆమె ఆర్ధిక పరమైన ఒత్తిళ్ల తో పై మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.మరోపక్క న్యూయార్క్ మేయర్ మైక్ బ్లూమ్ బర్గ్ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం తో కమలా హ్యారిస్ కు మద్దతు కొంచం తగ్గింది అని తెలుస్తుంది.అయితే కమలా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube