ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇంకా పలు డిమాండ్లతో ఆర్టీసీ ఎంప్లాయిస్ మొదలు పెట్టి సమ్మెపై కేసీఆర్ ఉక్కు పాదం మోపారు.ఆర్టీసీ ఎంప్లాయిస్‌కు సమ్మె చేసే అధికారం లేదు అంటూ వెంటనే విధులకు హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారు.
కేసీఆర్ ఆదేశాలను పాటించని వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లుగా అధికారికంగా కేసీఆర్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలోనే నేడు ఇందిరా పార్క్ వద్ద ఆర్టీసీ ఎంప్లాయిస్ నిరాహార దీక్ష చేపట్టాలని భావించారు.
కాని పోలీసులు అనుమతించక పోవడంతో నిరాహార దీక్షను వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించారు.
నిరాహార దీక్ష విషయంలో వెనక్కు తగ్గిన ఆర్టీసీ ఎంప్లాయిస్ అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపంకు నివాళ్లు అర్పించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని అక్కడకు వెళ్లనివ్వలేదు.పోలీసులు అక్కడ భారీగా చేరి ఎంప్లాయిస్‌ను అక్కడకు చేరనివ్వలేదు.గన్ పార్క్ వద్ద ఎంప్లాయిస్ నిరాహార దీక్షకు కూర్చునే అవకాశం ఉందని సమాచారం అందడంతో పోలీసులు వారిని అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఆర్టీసీ ఎంప్లాయిస్ మరియు ప్రభుత్వం మద్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాటం సాగుతోంది.