ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది.సమ్మె అధికారం, హక్కు లేని ఆర్టీసీ ఎంప్లాయిస్ ఎలా సమ్మె చేస్తున్నారంటూ ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్ చెప్పిన సమయం వరకు విధులకు హాజరు కాని ఎంప్లాయిస్‌ను డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.
గడువు లోగా కేవలం 1200 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు.వారు మాత్రమే ప్రస్తుతం ఆర్టీసీలో ఎంప్లాస్ అంటూ ఆయన ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో ఈ విషయమై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
అయితే కేసీఆర్ 48660 మందిని ఉద్యోగాల నుండి తొలగించగా, 2003వ సంవత్సరంలో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఏకంగా 1.70 లక్షల మందిని ఉద్యోగాల నుండి పీకేసింది.రెవిన్యూ మరియు ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా వారితో ఎన్ని సార్లు చర్చలు జరిపినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.
దాంతో వారికి చివరి హెచ్చరిక చేసిన అప్పటి సీఎం జయలలిత నిర్మొహమాటంగా వారందరిని కూడా తొలగించింది.వారిని తొలగించిన వెంటనే ఆర్డినెన్స్‌ను కూడా తీసుకు వచ్చింది.అప్పట్లో ఆ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ప్రధాని మరియు రాష్ట్రపతులు కూడా ఆ విషయమై చర్చించారు.
ఇప్పుడు మళ్లీ కేసీఆర్ నిర్ణయం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెర లేపింది.