సాధారణంగా 84 ఏళ్ల వయసు పడిన పెద్దవారు ఏమి చేస్తారు.మహా అయితే మనవ సంతానం తో ఆడుకుంటారు లేదంటే దేవుడిని స్మరించుకుంటూ రోజూ దేవుడికి సంబందించిన పుస్తకాలు చదువుతూనో కాలక్షేపం చేస్తూ ఉంటారు.
కానీ ఈ తాతగారి విషయంలో అలాంటిది ఏమి జరగడం లేదు సరికదా తన ఫ్యాషన్ తో ఇన్ స్టాగ్రామ్ లో స్టార్ గా మారిపోయాడు.ఆయన జపాన్ కు చెందిన తెత్సుయా, ఆయన వయస్సు 84 ఏళ్లు కానీ ఫ్యాషన్ అంటే మహా పిచ్చి.
దీనితో రోజుకో స్టైల్, పూటకో గెటప్ వేస్తుంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్టార్ గా మారాడు.తుత్సుయా రిటైర్డ్ కెమిస్ట్రీ టీచర్.
ఓ సారి ఊరి నుంచి వచ్చిన మనవడు అతడికి ఫ్యాషన్ గురించి వివరించాడు.
ఇక అంతే అప్పటి నుంచి కూడా తెత్సుయాకు ఫ్యాషన్ పై ఇంట్రస్ట్ పెరిగి ఇలా రోజు కొక రకం ఫ్యాషన్ బట్టలు ధరించి ఫోటోలకు ఫోజులిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో 1,02,000 మందికి పైగా ఫాలోయర్స్ ను సంపాదించారు.వయసు 84 సంవత్సరాలు అయినా ఫ్యాషన్ స్టార్‌గా మారిన తెత్సుయాను చూసి ఆయన స్టైల్‌ను ఫాలో అయ్యేవారు కూడా చాలామంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.