దేవుడు చెప్పాడని కన్న బిడ్దలను హత్యచేసిన కన్న తల్లికి 120 ఏళ్ల జైలు శిక్ష

2015 తన కన్న బిడ్డలనే దారుణంగా హత్య చేసిన కన్న తల్లికి న్యాయస్థానం 120 ఏళ్ల శిక్ష విధించినట్లు తెలుస్తుంది.వివరాల్లోకి వెళితే….

 Leroya Moore During Her Sentencing For Killing1telugustop Her Two Children In 2-TeluguStop.com

అమెరికా లోని ఈస్ట్ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయా మూరే 2015 లో దేవుడు ఆదేశించాడు అని చెబుతూ తన ఆరేళ్ల కుమార్తె ఆలీషా,ఏడేళ్ల కుమారుడు డారన్ ను హత్య చేసిన ఘటన లో పెను సంచలనం సృష్టించింది.తన సొంత బిడ్లను హత్య చేయడమే కాకుండా మూడు రోజుల పాటు వారి మృతదేహాల పక్కనే పడుకుంది.

అయితే అక్కడి స్థానికులకు మూరే ఇంటి నుంచి దుర్వాసన రావడం తో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

దేవుడు చెప్పాడని కన్న బిడ్దల

తన పిల్లలను దేవుడే చంపమని చెప్పారని,మళ్లీ వారిని బతికించేందుకు మృతదేహాలను తన ఇంట్లోనే ఉంచినట్లు పోలీసుల విచారణలో ఆమె తెలిపిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు.దీనితో ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన పోలీసులు ఈ ఏడాది మార్చిలో దర్యాప్తు పూర్తి చేశారు.దీనితో ఈ కేసును విచారించిన అమెరికా లోని ఒక న్యాయస్థానం ఆమెకు ఇద్దరు పిల్లలను హత్య చేసినందుకు గాను 60 ఏళ్ల చొప్పున 120 ఏళ్ల పెరోల్ కు సాధ్యం కానీ జైలు శిక్ష విధించినట్లు తెలుస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube