బందు మిత్రలు, కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.పెళ్లి ఇంట కనీసం తోరణాలుగా కట్టిన ఆకలు కూడా వాడలేదు.
అప్పుడే ఆ ఇంట వివాదం, విషాదం నెలకొంది.పెళ్లి కూతురు పెళ్లి అయిన తర్వాత రోజు కనిపించక పోవడంతో అంతా కూడా హైరానా పడ్డారు.
అమ్మాయికి తల్లి వారు ఇచ్చిన బంగారం మరియు ఇతరత్ర నగలు తీసుకుని వెళ్లి పోయింది.అయితే ఆ అమ్మాయి ఎటు వెళ్లింది ఎక్కడకు వెళ్లిందనే విషయం తెలుసుకునేందుకు బంధు మిత్రులకు తల ప్రాణం తోకకు వచ్చినంత ప్రనైంది.
ఈ సంఘటన మద్యప్రదేశ్‌లోని విదిషి జిల్లా తోరి బగ్రోద్ అనే గ్రామంలో జరిగింది.గ్రామానికి చెందిన పురోహితుడు మే 21న పెళ్లి చేశాడు.అదే పురోహితుడు 24వ తారీకు పెళ్లికి ఒప్పుకుని రాలేదు.ఫోన్ చేసినా సమాధానం లేదు.
దాంతో అనుమానం వచ్చి కాస్త డెప్త్‌గా ఎంక్వౌరీ చేయగా 21వ తారీకు పెళ్లిలోని పెళ్లి కూతురుతో అయ్యవారు జంప్ అయ్యాడని తెలిసింది.పెళ్లి సమయంకు ముందే అయ్యవారితో అమ్మాయికి ప్రేమ ఉందనే ప్రచారం జరుగుతుంది.

పెళ్లి అయిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశ్యంతో ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడి అయ్యవారు ఈ పని చేసినట్లుగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరో వ్యక్తి భార్యను ఇలా లేపుకు వెళ్లిన అయ్యగారిని గ్రామం నుండి వెలేయాలని నిర్ణయించారు.ఇక మరెప్పుడు పురోహిత్యం కూడా చేయకుండా ఆయన్ను బ్రహ్మణ సమాజం నుండి వెలివేయాలని నిర్ణయించుకున్నారు.
దాంతో ప్రస్తుతం గ్రామంలో హై టెన్షన్ నెలకొంది.అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ జంట కోసం వెదుకుతున్నారు.