ప్రభుత్వ ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయేలా ఉంటాయని అంతా అంటూ ఉంటారు.కంపెనీ యాజమాన్యంకు కోపం వచ్చినా ఉద్యోగికి నష్టం, అదే ఉద్యోగికి కోపం వచ్చినా ఉద్యోగికే నష్టం.
అన్ని రకాలుగా కూడా ఉద్యోగికి ఇబ్బందులు తప్పవు.అందుకే ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు నిమిషం ఒక గండం అన్నట్లుగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.
కొన్ని అనామక కంపెనీల్లో అయితే మరీ దారుణం.కంపెనీ ఉద్యోగస్తులను ఎప్పుడు ఎందుకు తీసేస్తారో ఆ కంపెనీ వారికి కూడా తెలియదు.

తాజాగా హర్యానాలోని గుర్గావ్ లోని ఒక కన్సల్టెన్సీ కంపెనీలో ఒక యువతి ఉద్యోగం చేస్తుంది.గత రెండున్న సంవత్సరాలుగా ఆమె జాబ్ చేస్తుంది.తాజాగా ఆమెను ఏవో చిల్లర చిన్న కారణాలు చూపుతూ ఆమెను తొలగించడం జరిగింది.ఉన్నట్లుండి జాబ్ నుండి తొలగించడంతో ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు.కనీసం మూడు నాలుగు నెలలు కూడా సమయం ఇవ్వక పోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.కంపెనీ యాజమాన్యంను ఎంతగా బతిమిలాడినా కూడా వినిపించుకోలేదు.
దాంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది.

కంపెనీ ఉన్న బిల్డింగ్ అయిదవ అంతస్తు మీదకు వెళ్లింది.అక్కడ కంటె గోడపై నిల్చుని చనిపోతానంటూ బెదిరించడం మొదలు పెట్టింది.తోటి ఉద్యోగులు ఎంతగా చెప్పినా కూడా వినిపించుకోలేదు.
ఆ తర్వాత ఆమెను దించేందుకు పోలీసులు కూడా వచ్చారు.కాని అప్పుడు కూడా ఆమె వెనక్కు రాలేదు.
చివరకు కంపెనీ యాజమాన్యం నుండి ఒక వ్యక్తి వచ్చి ఆమెను మళ్లీ జాబ్లో జాయిన్ చేసుకుంటామని చెప్పడంతో ఆమె దిగి వచ్చింది.కంపెనీ యాజమాన్యం ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంతో కథ సుఖాంతం అయ్యింది.