ఏపీ లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏదైనా ఉందంటే అది కేవలం నాగబాబు ,బాలయ్య ల మధ్య జరిగిన మాటల యుద్దమనే చెప్పాలి.తన తమ్ముడిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలకి గాను నాగబాబు యూట్యూబ్ ఛానెల్ లో దుమ్మురేపెలా చేసిన కామెంట్స్ అందరికి తెలిసిందే అయితే తాజాగా నాగబాబు లోకేష్ ని టార్గెట్ చేశారు.
అలా ఇలా కాదు.దాదాపు ఏపీ ప్రజలు అసలు ఏపీ సీఎం కొడుకు లోకేష్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారని మర్చిపోయిన సమయంలో నాగబాబు మళ్ళీ లోకేష్ పై విమర్శలు చేస్తూ ఏపీ ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
తనకంటూ వ్యక్తిగతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని ఏర్పాటు చేసుకున్నట్లుగా నాగబాబు ప్రకటించారు.ఇది కేవలం తన వ్యక్తిగతమని ఇందులో అన్నయ్య కి గాని , పవన్ బాబు కి గాని సంభంధం లేదని ముందుగానే చెప్పుకొచ్చారు.మై ఛానెల్ నా ఇష్టం అని పేరు తో ఈ ఛానెల్ రన్ చేస్తున్నానని.అయితే ఈ పేరు పెట్టినంత మాత్రాన నోటికి వచ్చినట్లు మాట్లాడతానని కాదని నిజాలు ప్రజలకి తెలిసేలా చేయడమే నా ఉద్దేశ్యమని అన్నారు.
రాజకీయ పరంగా విమర్శలు చేస్తాను తప్ప వ్యక్తిగత విషయాల జోలికి పోనని ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.
అయితే బాలయ్య ఎపీసోడ్ అయిపోవడంతో ఈ సారి ఒక్కో వీడియోలో ఒక్కో వ్యక్తిని ఎంపిక చేసుకుని ఫన్ జనరేట్ చేస్తాను అంటూ నాగబాబు చెప్పారు.
అయితే నాగబాబు తన మొదటి వీడియో కోసం ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ని ఎంపిక చేసుకున్నారు.అంతేకాదు సంచలన ,కామెడి వ్యాఖ్యలు చేస్తూ తన ఛానెల్ కి ఊపు పెంచేశారు.
తాను చిన్నప్పుడు “పిల్లలు దేవుడు చల్లని వారే” అంటూ పాట వినేవాడిని ఎందుకంటే పిల్లలు అస్సలు అబద్దాలు ఆడరు.పిల్లలకు అబద్దాలు అనేవి తెలియదు.
ఈ పిల్లాడు ఏం మాట్లాడాడో ఒక సారి చూడండి అంటూ.గతంలో లోకేష్ మాట్లాడిన ఓ వైరల్ వీడియోని చూపించారు.ఈ వీడియోలో లోకేష్ మాట్లాడుతూ
“మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎలాంటి అవినీతి బంధుప్రీతి మత పిచ్చి కుల పిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగు దేశం పార్టీయే’ అవునా కాదా తమ్ముళ్ళు అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను చూపించారు నాగబాబు.చూసారు కదా ఆ పిల్లాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో.నిజాన్నిఇంత నిర్భయంగా చెప్పగలిగే దమ్ము తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ లేదు ఒక్క లోకేష్ కి తప్ప , మీరు గ్రేట్ లోకేష్ అంటూ ఫాన్నీ కామెంట్స్ చేశారు.
అయితే ఈ వీడియోలు తమ్ముడికి చెక్క భజన చేయడానికి తప్ప మరెందుకు పని చేయవని.
ఈ సారి పవన్ కళ్యాణ్ పార్టీ కి మరకలు అంటుకునేలా చేసేది నాగబాబే అంటున్నారు పరిశీలకులు.