వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ విడుదలకు సిద్దం అయ్యింది.ఒక కార్యకర్తగా రాజకీయ ప్రస్థానంను ప్రారంభించిన వైఎస్ఆర్ ఎలా సీఎంగా ఎదిగాడనే విషయన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ఈ చిత్రంలో వైఎస్ రాజకీయ ఎంట్రీ, పాదయాత్ర, సీఎంగా అవ్వడం, మరణం వంటి అంశాలను చూపించబోతున్నారు.సినిమాకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
రాజకీయాల్లో వైఎస్ఆర్ తనదైన ముద్ర వేసిన నేపథ్యంలో అన్ని వర్గాల వారు కూడాఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముటీ పోషించాడు.కీలక పాత్రల్లో జగపతిబాబు, అనసూయ ఇంకా ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు.సెన్సార్ ముందుకు వెళ్లిన ఈ చిత్రానికి కీన్ యూ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు ఇచ్చింది.
ఎక్కడ ఎలాంటి కట్స్ చెప్పకుండా ఇలా ఒక బయోపిక్కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం మామూలు విషయం కాదు.ఎలాంటి వివాదాలు లేకుండా సెన్సార్ ముందుకు వెళ్లిన కారణంగానే ఈ చిత్రంకు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు వారు ప్రశంసలు కురిపించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు.రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని ఇందులో బాగా చూపించారని, తప్పకుండా ఆయన అభిమానులను ఈ చిత్రం అలరిస్తుందని అన్నారట.కమర్షియల్ సినిమాలా నడుస్తూనే వైఎస్ఆర్ జీవితంలోని అన్ని ఎలిమెంట్స్‌ను చూపడం అంటే మామూలు విషయం కాదు.దర్శకుడు మహి వి రాఘవ చాలా మంచి ప్రయత్నం చేశాడని సెన్సార్ వారు నిర్మాతలతో అన్నట్లుగా తెలుస్తోంది.
దాంతో ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.