జహీరాబాద్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు.
ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని తెలిపారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్న ప్రియాంక గాంధీ మహిళలకు బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు.
పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.ధరణితో రైతుల కష్టాలు పెరిగాయన్న ప్రియాంక గాంధీ రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని పేర్కొన్నారు.
తెలంగాణలో అవినీతి తీవ్రంగా ఉందని, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు.ప్రజల కోసం కాంగ్రెస్ పని చేస్తోందని స్పష్టం చేశారు.