హైదరాబాద్ డిఎవి స్కూల్ లో పలు డొల్లతనాలు బయటపడుతున్నాయి.స్కూల్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు అధికారులు.
ఐదో తరగతి వరకు పర్మిషన్ తీసుకుని 7వ తరగతి వరకు నిర్వహిస్తుంది.సిబిఎస్ఈ సిలబస్ నిర్వహణలోనూ రూల్స్ బ్రేక్ చేసింది స్కూల్ యాజమాన్యం.
రేపు హైదరాబాద్ డీఈవోతో స్కూల్ డైరెక్టర్ల భేటీ జరగనుంది.పాఠశాల భద్రతా ప్రమాణాల పై మంత్రి తో కమిటి భేటి కానుంది.
ఇటీవలే స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వైధింపులకు పాల్పడిన కేసు లో స్కూల్ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది.