ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆచార్య ప్లాప్ తో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని గాడ్ ఫాదర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్.
ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మరో సినిమాను రెడీ చేస్తున్నాడు.గాడ్ ఫాదర్ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను ఫ్యాన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని సిద్ధం చేస్తున్నాడు.
ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇటీవలే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసారు.
రాజమండ్రి లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.అలాగే వీరిద్దపై ఒక మాస్ సాంగ్ కూడా షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది.
ఈ మాస్ సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుందట.ఈ సాంగ్ లో చిరు ఒకప్పటి గ్రేస్ ను తప్పకుండ చూడవచ్చు అంటున్నారు.
అంతేకాదు రవితేజ స్టెప్పులు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమాలో మెగాస్టార్ కు రవితేజ సవతి తల్లి కొడుకు అని ఇప్పటికే రివీల్ అయ్యింది.

ఇక ఈ సినిమా ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశం గురించి ఇప్పుడు టాక్ బయటకు వచ్చింది ఇంటర్వెల్ లో మెగాస్టార్ పై రవితేజ ఎటాక్ చేస్తాడు అని.రెండు క్యారెక్ర్ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ఇంటర్వెల్ లోనే వస్తుందని ఆ తర్వాత రవితేజ పాత్రతో మెగాస్టార్ పాత్రకు మంచి అనుబంధం ఏర్పడుతుందని ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు నిర్మిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.అలాగే 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.







