చైనా: నిద్రలో ఉండగా ముక్కులోకి దూరిన బొద్దింక.. చివరికి?

అనారోగ్యాలు, అసౌకర్యాల బారిన పడకుండా ఉండాలంటే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా బొద్దింకలు, ఈగలు వంటి కీటకాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

 China: The Cockroach That Stuck In The Nose While Sleeping.. In The End , Cockro-TeluguStop.com

కానీ చైనాలో హెనాన్ ప్రాంతంలో నివసించే హైకో అనే 58 ఏళ్ల వ్యక్తి తన ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకున్నాడు దీనివల్ల అతని ఇంట్లో బొద్దింకలు పెరిగిపోయాయి ఒకరోజు నిద్రలో ఉన్నప్పుడు ఒక బొద్దింక అతడి ముక్కులోకి వెళ్లిపోయింది.అతను నిద్ర లేచినప్పుడు ముక్కులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది.

Telugu China, Cockroach, Hazards, Pest Control-Telugu NRI

కొన్ని రోజుల తర్వాత గొంతులోకి వెళ్లిపోయినట్లు అనిపించింది.దాంతో అతనికి దగ్గు, పసుపు రంగు నురుగు వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.చివరకు ఆయన డాక్టర్‌ను కలిశారు.స్కానింగ్ చేయించుకున్న తర్వాత ఆ బొద్దింక ( Cockroach)గొంతులో ఇరుక్కుపోయిందని తెలిసింది.డాక్టర్లు ఒక గంట పాటు శ్రమించి హైకో గొంతులో చిక్కుకున్న బొద్దింకను తీసేశారు.అయితే, ఆ బొద్దింక చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి ఉంది.

ఆ తర్వాత రోజు హైకో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు.ఆయనకు చికిత్స చేసిన డాక్టర్ లింగ్ లింగ్ ఇలాంటి కేసు తన జీవితంలో మొదటిసారిగా చూస్తున్నట్లు చెప్పారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సంఘటనలు నిర్లక్ష్యం వల్ల జరుగుతాయని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని కూడా పేర్కొన్నారు.

Telugu China, Cockroach, Hazards, Pest Control-Telugu NRI

ఈ సంఘటన ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.కొంతమందికి ఇది చాలా ఫన్నీగా అనిపించినప్పటికీ, చాలామందికి ఇది చాలా ప్రమాదకరంగా అనిపించింది.కొందరు ఈ బొద్దింక ఆ వ్యక్తి గొంతులో గుడ్లు పెట్టి ఉంటుందేమో అని అనుమానిస్తూ ఇది చాలా అసహ్యంగా ఉందని అన్నారు.

మరికొందరు ఆ వ్యక్తికి ఎలాంటి శాశ్వత నష్టం జరిగిందో అని ఆందోళన చెందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube