తెలుగులో ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss 8 ) కార్యక్రమం ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమం 14 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం అయింది .
ఇక రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు.మొదటి వారం హౌస్ నుంచి బెజవాడ బేబక్క( Bejawada Bebakka ) ఎలిమినేట్ కాగా రెండవ వారం ఊహించని విధంగా శేఖర్ భాషా( Sekhar Basha ) హౌస్ నుంచి బయటకు వచ్చారు.
ఇలా శేఖర్ భాష హౌస్ నుంచి బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
శేఖర్ భాష కంటే తక్కువ ఓట్లు కలిగిన పృద్వి, కిరాక్ సీత ఉన్నారు.
వారిని కాదని శేఖర్ భాష ఎలిమినేట్( Sekhar Basha Eliminate ) కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే ఇలా ఊహించని విధంగా శేఖర్ భాష హౌస్ నుంచి బయటకు రావడమే కాకుండా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ చరిత్రలోనే నాది హ్యాపీ ఎలిమినేషన్ అని ఈయన తెలిపారు.

నేను కావాలనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాను అని తెలిపారు.బిగ్ బాస్ ను తాను బయటకు వెళ్తానని వేడుకున్నాను.నాకు కొడుకు పుట్టడంతో ఎప్పుడెప్పుడు తనని చూడాలా అన్న ఆత్రుతతో నేనే బయటకు వచ్చేసానని ఈయన తెలిపారు.
ఇక హౌస్ లో నన్ను అందరూ చాలా మంచిగా ప్రోత్సహించేవారు ఇక నేను మరింత ముందుకు వెళ్లాలి అంటూ నన్ను అభిమానించి ఓట్లు వేసిన వారందరు కూడా నన్ను ఈ విషయంలో క్షమించాలి అంటూ ఈయన క్షమాపణలు కోరారు.

శేఖర్ బాషా హౌస్ లోకి వెళ్లిన కొద్దిరోజులకి తనకు కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే.ఇదే విషయాన్ని నాగార్జున( Nagarjuna ) శనివారం ఎపిసోడ్ లో తెలియజేయగా శేఖర్ భాష ఒకసారిగా ఎమోషనల్ అయ్యారు.అయితే తనకు కొడుకు పుట్టారనే విషయం తెలియడంతో తన కొడుకుని చూడటం కోసమే ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చారని లేదంటే ఈయన మరి కొంతకాలం పాటు హౌస్ లో కొనసాగే వారని తెలుస్తుంది.