తమిళంలో ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతూ ఉంటాయి.అటువంటి వాటిలో నాట కుక్ విత్ కోమలి( Cook With Comali ) షో కూడా ఒకటి.
కాగా ఈ షోకి ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.తెలుగులో సుమ షోలు, శ్రీదేవీ డ్రామా కంపెనీలు, జబర్దస్త్ షోలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో, అక్కడ ఈ కుక్ విత్ కోమలి షోకు అంత క్రేజ్ ఉంటుంది.
ఇక ఈ షోలో మణిమేఘలై( Anchor Manimegalai ) తన యాంకరింగ్ తో అదరగొడుతుంటుంది.వంట తెలిసి ఒక గ్యాంగ్ వంట అంటే ఏంటో తెలియని మరో గ్యాంగ్ కలిసి ఈ షోలో రచ్చ రచ్చ చేస్తుంటారు.
అందరూ కలిసి ఒక వంటకాన్ని ఎలా వండుతారు అనేది ఈ షో యొక్క కాన్సెప్ట్.
ఈ షోలో చిన్న చిత్రాల ప్రమోషన్స్ కూడా జరుగుతుంటాయి.ఇక ఈ షో నుంచి యాంకర్ మణిమేఘలై తప్పుకుంది.వెళ్తూ వెళ్తూ షో మీద ఆరోపణలు చేసింది.
షోలో ఉన్న మరో ఫీమేల్ యాంకర్ ఆగడాలు, ఆధిపత్యం గురించి చెప్పి వెళ్లిపోయింది.తనకు సెల్ఫ్ రెస్పెక్ట్( Self Respect ) కంటే ఏదీ ముఖ్యం కాదని, తన కెరీర్ ప్రారంభం నుంచీ అదే లైన్ మీద ఉన్నానని, తనకు డబ్బు, క్రేజ్, ఫేమస్ అవ్వడం కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం అని దాని తరువాతే ఏదైనా అని మణిమేఘలై చెప్పుకొచ్చింది.
అలాగే ఇకపై తాను కుక్ విత్ కోమలి షోలో భాగస్వామిని కాదని, తనకు ఆ షోతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.
2019 నవంబర్‌లో షో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నా వంద శాతం ఎపర్ట్స్, హార్డ్ వర్క్, డెడికేషన్ తో పని చేశానని ఇకపై ఇక్కడ పని చేయబోవడం లేదని తెలిపింది.ఈ షోలోని ఓ ఫీమేల్ యాంకర్ డామినేషన్ ఎక్కువైందని, తన పని కుక్ చేయడం అయితే యాంకర్ పార్టులో వేలు పెడుతోందని, తన ప్రమేయం లేకుండా మొత్తం మార్చేస్తున్నారని వాపోయింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.