దేవరపై నెగిటివిటీలో ఏ మాత్రం నిజం లేదుగా.. ఫ్యాన్స్ కు ట్రైలర్ ఎంతో నచ్చేసిందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) కొరటాల శివ( Koratala Siva ) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబోలో తెరకెక్కిన దేవర మూవీ( Devara ) గురించి సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరుగుతోంది.దేవర ట్రైలర్ పై( Devara Trailer ) మొదట కొంతమేర నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

 No Truth In Devara Movie Negativity Details, Devara Movie, Ntr, Junior Ntr, Ntr-TeluguStop.com

అయితే దేవరపై నెగిటివిటీలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.

సందీప్ రెడ్డి వంగాతో( Sandeep Reddy Vanga ) దేవర టీమ్ ఇంటర్వ్యూ చేయగా అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఈ వీడియోకు కేవలం గంటలోనే ఏకంగా 57000కు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోలో దేవర సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సైతం వెల్లడించడం జరిగింది.

దేవర సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటి కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

దేవర సినిమా ఈతరం యూత్ ను సైతం మెప్పించడం పక్కా అని సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.దేవర1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే మాత్రం దేవర సీక్వెల్ పై కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.ఈ సినిమాలో సైఫ్ విలనిజం కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.

సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ వల్ల హిందీలో సైతం ఈ సినిమాకు కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.దేవర సెన్సార్ ను పూర్తి చేసుకోగా యు/ఎ సర్టిఫికెట్ రావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ సందీప్ రెడ్డి వంగా కాంబో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబో అనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube