అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్( Kamala Harris ) ప్రచారంలోనూ , నిధుల సేకరణ విషయంలోనూ దూసుకెళ్తున్నారు.
ఇటీవల జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లోనూ డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) కమల పై చేయి సాధించారు.దీంతో అమెరికా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
నాటి నుంచి కమల విషయంలో అలర్ట్ అయిన రిపబ్లికన్లు .విమర్శల దాడిని పెంచారు.ఇదే సమయంలో అమెరికన్ రేపర్, గ్రామీ అవార్డ్ విజేత టేలర్ స్విఫ్ట్( Taylor Swift ) తాను కమలా హారిస్‌కు మద్ధతు ఇస్తున్నట్లుగా ప్రకటించడం కలకలం రేపింది.నవంబర్ 5 ఎన్నికల్లో కమలా హారిస్, టిమ్ వాజ్‌కు ఓటు వేస్తానని ఆమె రీసెంట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
టేలర్ నిర్ణయం డొనాల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది.ఆమెపై తన అక్కసు వెళ్లగక్కుతూ వ్యక్తిగత విమర్శలకు దిగారు మాజీ అధ్యక్షుడు.టేలర్ ఎప్పుడూ డెమొక్రాట్లనే సమర్ధిస్తున్నట్లుగా అనిపిస్తుందని.ఆమె భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.అయితే టేలర్ ప్రకటన తర్వాత ముందస్తు పోల్స్ ఫలితాలు వేగంగా మారిపోయాయి.YouGov అనే సంస్థ శనివారం కొత్త పోల్ ఫలితాలను విడుదల చేసింది.
ప్రెసిడెన్షియల్ డిబేట్( Presidential Debate ) అనంతరం 8 శాతం మంది మాత్రమే అదనంగా కమలా హారిస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సర్వే అంచనా వేసింది.టేలర్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయానికి వస్తే.20 శాతం మంది కొంత వరకు ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.కానీ 66 శాతం మంది మాత్రం తమ టేలర్ స్విఫ్ట్ ప్రకటనకు ముందులాగే ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.ఆన్‌లైన్‌లో 32 శాతం మంది మాత్రం టేలర్ నిర్ణయం డెమొక్రాట్ల ప్రచారంపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్వసించారు.27 శాతం మంది టేలర్ ఎండార్స్‌మెంట్ ఎలాంటి ప్రభావం చూపదని అభిప్రాయపడ్డారు.